Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు

Controversy Surrounding Famous Choreographer Johnny Master
Advertisement
  • తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు
  • జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
  • కేసు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ
Advertisement
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై లైంగిక ఆరోపణల కేసు చేశారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

సదరు మహిళ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.
Advertisement
Advertisement
Johnny Master
Tollywood
TS Police
Crime News

More Telugu News